ఘనంగా సంకష్టహర చతుర్థి వేడుకలు
జగిత్యాల, నవంబర్ 27, మన భారత్ : జగిత్యాల జిల్లా పొలాసలోని సహస్ర లింగాల దేవాలయంలో శుక్రవారం సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం 7:30 గంటల నుండి 11:00 గంటల వరకు మహాగణపతికి పంచామృత అభిషేకం నిర్వహించారు. భక్తులందరూ స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం కల్పిoచామని వేయి లింగాల ఆలయ ఫౌండర్ చైర్మన్ నలమాస గంగాధర్ తెలిపారు. ఈ సందర్బంగా నలమాస గంగాధర్ మాట్లాడుతూ “సంకష్టహర చతుర్థి అంటేనే విఘ్నాలు...