జగిత్యాల, నవంబర్ 27, మన భారత్ :
జగిత్యాల జిల్లా పొలాసలోని సహస్ర లింగాల దేవాలయంలో శుక్రవారం సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం 7:30 గంటల నుండి 11:00 గంటల వరకు మహాగణపతికి పంచామృత అభిషేకం నిర్వహించారు. భక్తులందరూ స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం కల్పిoచామని వేయి లింగాల ఆలయ ఫౌండర్ చైర్మన్ నలమాస గంగాధర్ తెలిపారు. ఈ సందర్బంగా నలమాస గంగాధర్ మాట్లాడుతూ “సంకష్టహర చతుర్థి అంటేనే విఘ్నాలు తొలగిపోయే పవిత్రమైన రోజన్నారు. ప్రతి భక్తుడు స్వయంగా గణపతికి పంచామృత అభిషేకం చేసుకుని, స్వామి కృప పొందాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేశామన్నారు. పంచామృతాలను భక్తులకు ఉచితంగానే అందిoచగా అందరూ వచ్చి, దర్శించుకున్నారని తెలిపారు. అభిషేకం అనంతరం గణపతి అష్టోత్తర నామాలతో పూజ, వేద బ్రాహ్మణుల ఆశీర్వాదం, తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు శివయ్యకు అన్నాభిషేకం నిర్వహించారు. భక్తులందరూ ఈ పుణ్యకార్యంలో పాల్గొని స్వామివారి సభ్యులు కోరారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
