మొగుళ్ళపల్లి: నవంబర్ 27,(మన భారత్):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గోనె రాజిరెడ్డి,( 68 ) పురుగుల మందు తాగి మృతి చెందాడు.పోలీసుల వివరాల ప్రకారం గత మూడు సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత నొప్పి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ 26న ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్ ద్వారా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో సాయంత్రం 5:30 గంటల సమయంలో మృతి చెందాడు. మృతుడి భార్య గోనె ఆగమ్మ, ఫిర్యాదు మేరకు మొగుళ్ళపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
