manabharath.com
Newspaper Banner
Date of Publish : 27 November 2026, 11:58 am Editor : user5442714

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న అడువాల జ్యోతి లక్ష్మణ్ దంపతులు

పెళ్లిరోజు సందర్భంగా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న అడువాల జ్యోతి లక్ష్మణ్ దంపతులు
– ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న కుటుంబ సభ్యులు
జగిత్యాల/కొండగట్టు, నవంబర్ 27, మన భారత్ :
తమ పెళ్లిరోజు సందర్భంగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అడువాల జ్యోతి లక్ష్మణ్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తమ దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కొనసాగాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి కొంత సమయం గడిపారు. పెళ్లిరోజు సందర్భంగా ఆంజనేయస్వామి దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని జ్యోతి లక్ష్మణ్ తెలిపారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});


(adsbygoogle = window.adsbygoogle || []).push({});