“స్మశాన వాటికలో సౌకర్యాలు కల్పించిన బట్టు కుటుంబ సభ్యులు”
జగిత్యాల, నవంబర్ 27, మన భారత్ :
గొల్లపల్లి రోడ్డులో గల శ్రీ సత్య హరిచంద్ర స్మశాన వాటికలో చనిపోయిన కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలను నిర్వహించుకోవటంలో పడుతున్న ఇబ్బందులను గమనించి మానవతా దృక్పథంతో స్పందించిన పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపార కుటుంబ సభ్యులు దివంగతులైన తమ తండ్రి గారైన శ్రీ బట్టు శ్యామ్ గారి జ్ఞాపకార్థం వీరి కుమారులు బట్టు మనోజ్ కుమార్ బట్టు ధీరజ్ కుమార్ బట్టు సూరజ్ కుమార్ లు, దివంగత శ్రీ బట్టు జనార్దన్ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు బట్టు అర్జున్ కుమార్ బట్టు శ్రావణ్ కుమారులు స్మశాన వాటికలో వాటర్ ట్యాంక్ ను, స్నానాలు చేయడానికి కావలసిన ఫ్లాట్ ఫామ్ ను , నల్లాలను ఏర్పాటు చేయడమే కాకుండా వంట చేసుకోవటానికి కావలసిన వసతి సౌకర్యాలను కూడా కల్పించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సందర్భంగా వీరితోపాటు కార్యక్రమంలో పాల్గొన్న 22వ వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మి మాజీ కౌన్సిలర్ ఏసిఎస్ రాజు మనిషి జీవితానికి చివరి వీడ్కోలు చెప్పే ఈ పవిత్ర ప్రదేశంలో సామాజిక బాధ్యతతో తగిన సౌకర్యాలు కల్పించిన బట్టు కుటుంబ సభ్యుల సేవలను కొనియాడుతూ వారిని అభినందించారు. వీరితోపాటు ఈ కార్యక్రమంలో అక్కినపల్లి కాశీనాథం కూడా పాల్గొని వారిని అభినందించారు.ఈ సందర్భంగా బట్టు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఇది సమాజం పట్ల తమ బాధ్యత అని మున్ముందు కూడా ఇలాంటి సేవలను కొనసాగించే శక్తిని భగవంతుడు తమకు ఇవ్వాలని అన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
