జగిత్యాల, నవంబర్ 26, మన భారత్ :
ఏఐసీసీ ఇన్‌చార్జి బి.ఎం. సందీప్ కుమార్‌తో మంత్రి అడ్లూరి భేటీ. మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపిన మంత్రి. గాంధీ భవన్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జి బి.ఎం. సందీప్ కుమార్‌ను శుక్రవారం రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సందీప్ కుమార్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భేటీలో పార్టీకి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
