22వ వార్డులో నాలుగో రోజు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు
జగిత్యాల, నవంబర్ 27, మన భారత్ :
జగిత్యాల పట్టణంలోని 22వ వార్డు పరిధిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమం నాలుగో రోజు కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక కౌన్సిలర్ అరవ లక్ష్మి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అరవ లక్ష్మి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించే ఈ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే నమోదు చేసుకున్న వారితో పాటు, ఇంకా నమోదు చేసుకోని అర్హులైన కుటుంబ సభ్యులు కూడా ముందుకు వచ్చి తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. 22వ వార్డులో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం ప్రయోజనం అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఈ నమోదు కార్యక్రమానికి సహకరించి, అర్హులైన ప్రతి ఒక్కరూ పథకంలో నమోదు చేసుకునేలా ముందుకు రావాలని కౌన్సిలర్ అరవ లక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ అంజలి, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
