manabharath.com
Newspaper Banner
Date of Publish : 27 November 2026, 2:46 am Editor : user5442714

మిత్రుని కుటుంబానికి రూ.29,500 ఆర్థిక సాయం – జీవితాంతం అండగా ఉంటామని భరోసా!

మిత్రుని కుటుంబానికి రూ.29,500 ఆర్థిక సాయం – జీవితాంతం అండగా ఉంటామని భరోసా!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మొగుళ్ళపల్లి: నవంబర్ 26, (మన భారత్):

మొగుళ్లపల్లి జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థులు. మొగుళ్లపల్లి మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన ఓనపాకల రాంచందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉన్నారు. పిల్లలిద్దరు చాలా చిన్నవారు కావడంతో, కుటుంబానికి ఆధారమైన వ్యక్తిని కోల్పోయి ఆ కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారి, ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ హృదయ విదారక పరిస్థితిని తెలుసుకున్న 1999-2000 సంవత్సరంలో మొగుళ్లపల్లి జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు చలించిపోయారు. పాతికేళ్లు గడిచినా తమ స్నేహ బంధం చెక్కుచెదరలేదని నిరూపిస్తూ, తమ మిత్రుని ఇద్దరు కూతుళ్ల భవిష్యత్తు కోసం ముందుకు వచ్చారు. తమ వాట్సాప్ గ్రూప్ ద్వారా మొత్తం రూ.29,500 ఆర్థిక సహాయాన్ని సేకరించి, మృతుని కుటుంబానికి అందజేశారు. కేవలం ఆర్థిక సాయమే కాదు, “నాన్న లేని ఆ చిన్నారులకు జీవితాంతం అండగా ఉంటాం, వారి చదువు, భవిష్యత్తుకు అన్ని విధాలుగా ఆసరాగా ఉంటాం” అని ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సంఘటన మండలంలోని పలువురిని కంటతడి పెట్టించింది. మిత్రుడు మరణించినా స్నేహం మరణించదని, ఆ స్నేహం ఇద్దరు చిన్న ఆడపిల్లలకు రక్షణ కవచంగా నిలుస్తుందని నిరూపించిన మొగుళ్లపల్లి మిత్రులను గ్రామస్తులు, ఉపాధ్యాయులు, ప్రజలు అభినందిస్తున్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});