manabharath.com
Newspaper Banner
Date of Publish : 27 November 2026, 1:31 am Editor : user5442714

రాజ్యాంగం కల్పించిన హక్కులు సమానత్వం సామాజిక న్యాయ విలువలను గౌరవించాలి: మల్యాల మనోజ్ మాదిగ

అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి భారతీయుడు నడుచుకోవాలి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయ విలువలను గౌరవించాలి: మల్యాల మనోజ్ మాదిగ

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 26, భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కల్పించే గొప్ప మార్గదర్శకమని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి భారతీయుడు నడుచుకోవాలని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్ మాదిగ పిలుపునిచ్చారు.

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26, 2026న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో తెలంగాణ మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మల్యాల మనోజ్ మాదిగ మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాత్రింబవళ్లు కృషి చేసి, రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించి, ప్రపంచంలోనే విశిష్టమైన రాజ్యాంగాల్లో ఒకటైన భారత రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు అందించారని కొనియాడారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం భారత ప్రజాస్వామ్యానికి పునాది అని పేర్కొన్నారు.

హిందువులకు భగవద్గీత, ముస్లింలకు ఖురాన్, క్రైస్తవులకు బైబిల్ ఏ విధంగా మార్గదర్శకాలుగా ఉన్నాయో, భారతదేశంలోని ప్రతి పౌరుడు అనుసరించాల్సిన మార్గదర్శకం భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగమని ఆయన అన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, సామాజిక న్యాయం వంటి విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు.

రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రజలు అవగాహన పెంచుకోవడంతో పాటు, తమ బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తించాలని కోరారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని మల్యాల మనోజ్ మాదిగ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ జేఏసీ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మోతే బారికరావు మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షులు నక్క రాందాస్ మాదిగ, జిల్లా కోశాధికారి లింగంపల్లి ప్రసన్నకుమార్ మాదిగ, జిల్లా కార్యదర్శి తారా రవికుమార్ మాదిగ, పట్టణ అధ్యక్షులు జెల్ల మహేందర్ మాదిగ, జిల్లా సహాయ కార్యదర్శి ముక్కెర అశోక్ మాదిగ, కొలం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొడప సోనేరావు మాదిగ, జేఏసీ జిల్లా నాయకులు గజ్జల విలాస్ మాదిగ, ఉప్పరి లింగన్న మాదిగ, కల్లేపల్లి మల్లయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});