manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 5:02 pm Editor : user5442714

రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ ఎస్పీకి ఘన సన్మానం అంబేద్కర్ ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేస్తాం: దుర్గం శేఖర్

రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో కలెక్టర్, ఎస్పీకి ఘన సన్మానం
అంబేద్కర్ ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేస్తాం: దుర్గం శేఖర్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 26,

ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను దళిత జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి కల్పించిన హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం వంటి మౌలిక విలువలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా పలువురు నాయకులు పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌లను దళిత జేఏసీ నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ ఎస్సీ డిపార్ట్‌మెంట్ ఇన్‌చార్జ్ దుర్గం శేఖర్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. దళితుల హక్కుల పరిరక్షణ, సామాజిక సమానత్వం, అణగారిన వర్గాలకు న్యాయం జరిగేలా నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.

భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, అంబేద్కర్ చూపిన మార్గంలో పయనిస్తూ రాజ్యాంగ విలువలను కాపాడుకోవడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని దుర్గం శేఖర్ స్పష్టం చేశారు. అంబేద్కర్ ఆశయాల సాధన, సమానత్వ సమాజ నిర్మాణం కోసం నిరంతరం ముందుకు సాగుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్, దళిత సంఘాల నాయకులు,అధికారులు, తదితరులు పాల్గొన్నారూ



(adsbygoogle = window.adsbygoogle || []).push({});