manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 3:52 pm Editor : user5442714

మానవీయత చాటుకున్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్..

నిరుపేద మహిళకు ఇందిరమ్మ ఇంటి మంజూరు.
మానవీయత చాటుకున్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, రాజన్న సిరిసిల్ల:

సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నిరుపేద మహిళకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అండగా నిలిచారు. ఆమె పరిస్థితిని తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటిని మంజూరు చేస్తూ బుధవారం రాత్రి మంజూరు పత్రాన్ని అందజేశారు.

చందుర్తి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన మర్రిపల్లి అమృత బతుకుదెరువు కోసం సుమారు 20 ఏళ్ల క్రితం నిజామాబాద్ జిల్లాకు వెళ్లారు. నాలుగేళ్ల క్రితం తన కుమారుడి అనారోగ్య సమస్యల నేపథ్యంలో వేములవాడకు వచ్చారు. సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో నివసిస్తూ, అద్దె చెల్లించలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అమృత ఎదుర్కొంటున్న దీనస్థితిని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెంటనే స్పందించారు. అధికారుల ద్వారా ఆమె వివరాలు సేకరించి, ఆమెకు సహాయం అందించే దిశగా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం రాత్రి అమృతకు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాన్ని ప్రత్యేకంగా అందజేశారు.

వేములవాడ పట్టణంలోని 12వ వార్డులో తనకు 60 గజాల స్థలం ఉందని, అందులో ఇల్లు నిర్మించుకుంటానని అమృత తెలిపారు. తన కష్టాలను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేక చొరవ చూపిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి హౌసింగ్ పీడీ సాజిద్, వేములవాడ మున్సిపల్ కమిషనర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});