హైదరాబాద్లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఎల్బీనగర్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆదిలాబాద్ జిల్లా వాసులు
మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 26:
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఎల్బీనగర్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్తలు ప్రేమకళ, మెస్రం మీనా పాల్గొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా జైభారత్ ఎస్సీ ప్రధాన కార్యదర్శిగా ఆదిలాబాద్ జిల్లా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రేమకళ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కల్పించిందని తెలిపారు. రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, ముఖ్యంగా మహిళలు విద్య, సామాజిక, రాజకీయ రంగాల్లో ముందుకు రావాలని పేర్కొన్నారు.
అదేవిధంగా జైభారత్ విప్లవ రణభేరి సంస్థలో సామాజిక మహిళా కార్యకర్తగా పనిచేస్తున్న మెస్రం మీనా మాట్లాడుతూ మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ గురించి సమాజంలో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా వాసులు పాల్గొని రాజ్యాంగ విలువల పరిరక్షణకు తమ సంఘీభావాన్ని తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
