manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 4:27 pm Editor : user5442714

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం..

మృతుల కుటుంబాలను పరామర్శించి సానుభూతి తెలిపిన సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

భోరజ్, జైనథ్ మండలాల్లో బాధిత కుటుంబాలకు నాయకుల పరామర్శ

మన భారత్, జైనథ్:నవంబర్ 26,

ఇటీవల వివిధ కారణాలతో మృతిచెందిన పలువురి కుటుంబాలను సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకుని, మృతుల చిత్రపటాలకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా భోరజ్ మండలంలోని మాండగడ గ్రామానికి చెందిన అల్లూరి నవీన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా జైనథ్ మండలంలోని దీపాయిగూడ గ్రామానికి చెందిన గుమ్మడి లస్మారెడ్డి కుటుంబాన్ని, కూర గ్రామానికి చెందిన గంగం విమల బాయి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు.

ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు కలిగిన నష్టాన్ని పూడ్చలేనప్పటికీ, కష్టకాలంలో వారికి ధైర్యం చెప్పడం, అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఈ సందర్భంగా ముడుపు మౌనిష్ రెడ్డి పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని, ఏ అవసరం వచ్చినా తమవంతు సహకారం అందిస్తామని భరోసా కల్పించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో పూండ్రు అశోక్ రెడ్డి, గోక సాగర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ఆశన్న యాదవ్ తదితరులు పాల్గొని బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});