manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 5:19 pm Editor : user5442714

ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..

మన భారత్ చల్లగరిగ, నవంబర్ 26: చల్లగరిగ అంబేద్కర్ చౌరస్తాలో సామాజిక కార్యకర్త, అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డు గ్రహీత నోముల శివశంకర్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ 77వ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి, రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో MRPS మండల అధ్యక్షులు కొల్లూరి అశోక్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు దూడపాక సురేందర్, స్వేరోస్ మండల అధ్యక్షులు నోముల ప్రియతం, SC సెల్ అధ్యక్షులు సోమిడి రఘుపతి, ప్రధానోపాధ్యాయులు బండి శ్రీనివాస్, MRPS-MSP జిల్లా నాయకులు జేరిపోతుల ఓదేలు, కళాబృందం నాయకులు దూడపాక దివాకర్, సిరిపెల్లి సారయ్య, విలేజ్-మైలేజ్ ఆర్గనైజేషన్ టీం సభ్యులు MD రఫీ, ఓరుగంటి నగేష్, బోనగాని సదయ్య, మ్యాదరి రామస్వామి, వీరాస్వామి, తోనగరి బాపనయ్య తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});


(adsbygoogle = window.adsbygoogle || []).push({});