రజక సంఘం పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన నాగన్నకు ఘన సన్మానం
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
శాలువా కప్పి అభినందనలు తెలిపిన సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి, పలువురు నాయకులు
మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 26,
రజక సంఘం పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన నాగన్నను సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి, పలువురు ప్రముఖులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా నాగన్నకు శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ముడుపు మౌనిష్ రెడ్డి మాట్లాడుతూ రజక సంఘం పట్టణ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాగన్న సంఘం అభివృద్ధికి, సభ్యుల ఐక్యతకు కృషి చేయాలని ఆకాంక్షించారు. రజక సంఘం బలోపేతానికి నాయకత్వం వహిస్తూ, సంఘ సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
సంఘం అభివృద్ధి, సామాజిక ఐక్యత, సభ్యుల సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. నాగన్న నాయకత్వంలో రజక సంఘం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ఆశన్న యాదవ్, శేషయ్య, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొని నాగన్నకు అభినందనలు తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
