ఎల్లారెడ్డిపేటలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం..
ఎల్లారెడ్డిపేటలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ, ఎస్టీ జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యుడు బిపేట రాజ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా మండలంలోని వివిధ దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాల...