manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 4:47 pm Editor : user5442714

ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు షురూ..

నామాపూర్‌లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
జగిత్యాల/పెగడపల్లి, నవంబర్ 26, మన భారత్ :
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నామాపూర్ గ్రామంలో గల గ్లోరియస్ మైటీ గొస్పెల్ మినిస్ట్రీస్ చర్చ్ ఆధ్వర్యంలో పిల్లల కోసం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన సంఘ సభ్యులతో కలిసి చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని క్రిస్మస్ సంబరాలను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా జగిత్యాల జిల్లా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రెవ. ఎలాగందుల శ్రీనివాస్ జోసఫ్ క్రీస్తు జననం యొక్క ప్రాముఖ్యత, దేవుని ప్రేమ, ప్రేమ, శాంతి, సోదరభావం వంటి క్రైస్తవ విలువలను పిల్లలకు తెలియజేశారు. చిన్నారులలో ఆధ్యాత్మిక భావాలు, ప్రేమ, ఐక్యతను పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, చిన్న పిల్లలు తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});


(adsbygoogle = window.adsbygoogle || []).push({});