manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 4:43 pm Editor : user5442714

జెడ్పీఎస్‌ఎస్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

కుచులాపూర్ జెడ్పీఎస్‌ఎస్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సామాజిక విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలో విద్యార్థుల ప్రతిభ.. 20 ప్రాజెక్టు నమూనాలతో ఆకట్టుకున్న చిన్నారులు

మన భారత్, తలమడుగు, నవంబర్ 26:

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచులాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల (ZPSS)లో 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మోడేపు వెంకన్న ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు నమూనాలను పరిశీలించారు. అనంతరం పాఠశాలలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ క్విజ్ పోటీల్లో పాల్గొన్నారు.

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో సామాజిక విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో విద్యార్థులు భారత రాజ్యాంగానికి సంబంధించిన అంశాలతో పాటు గ్రహాలు, గ్లోబల్ వార్మింగ్, ఆదిమానవుల జీవన విధానం తదితర అంశాలపై సుమారు 20 ప్రాజెక్టు నమూనాలను రూపొందించి ప్రదర్శించారు. విద్యార్థులు తమ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను వివరించగా, సర్పంచ్ వెంకన్న వాటిని ఆసక్తిగా పరిశీలించి విద్యార్థులను అభినందించారు.

రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన

అనంతరం విద్యార్థులకు భారత రాజ్యాంగంపై క్విజ్ పోటీలు నిర్వహించారు. రాజ్యాంగ రూపకల్పన, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పీఠిక తదితర అంశాలపై ప్రశ్నలు అడిగి విద్యార్థుల్లో రాజ్యాంగంపై అవగాహన పెంపొందించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సోదరభావం వంటి విలువలను అందించిందని వివరించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే రాజ్యాంగ స్ఫూర్తిని అలవర్చుకుని బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు.

శ్రీలత ఉపాధ్యాయురాలు రాజ్యాంగ పీఠికను వివరించడంతో పాటు రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలను విద్యార్థులకు తెలియజేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల హక్కులు, బాధ్యతలు, రాజ్యాంగ విలువల ప్రాధాన్యతను వివరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోడేపు వెంకన్న, ఉప సర్పంచ్ రాగి నిలబయి దీపక్, తోట శ్రీనివాస్, గీస మల్లయ్య, కామెరి రమాకాంత్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీలత, గణపతి, రామ్‌కుమార్, ఏకనాథ్, వికాస్ తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});