శ్రీ విహాన్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..
మన భారత్, భీంపూర్: శ్రీ విహాన్ పబ్లిక్ స్కూల్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పాఠశాల కరస్పాండెంట్ ఆలేటి మౌనిక రవీందర్, ప్రిన్సిపాల్ విజయసారథి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఉదయం ప్రార్థనా సమయంలో విద్యార్థులు భారత రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివి రాజ్యాంగంలోని గొప్ప ఆశయాలను స్మరించుకున్నారు. ప్రజాస్వామ్యం, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం రాజ్యాంగం, భారతదేశ చరిత్ర, పౌర హక్కులు, బాధ్యతలకు...