manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 11:41 am Editor : Editor Vishal Kumar

శ్రీ విహాన్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..

మన భారత్, భీంపూర్: శ్రీ విహాన్ పబ్లిక్ స్కూల్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పాఠశాల కరస్పాండెంట్ ఆలేటి మౌనిక రవీందర్, ప్రిన్సిపాల్ విజయసారథి ఆధ్వర్యంలో జరిగింది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా ఉదయం ప్రార్థనా సమయంలో విద్యార్థులు భారత రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివి రాజ్యాంగంలోని గొప్ప ఆశయాలను స్మరించుకున్నారు. ప్రజాస్వామ్యం, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

అనంతరం రాజ్యాంగం, భారతదేశ చరిత్ర, పౌర హక్కులు, బాధ్యతలకు సంబంధించిన అంశాలపై విద్యార్థులకు క్విజ్ పోటీ నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొని తమ జ్ఞానాన్ని ప్రదర్శించారు. పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు.

రాజ్యాంగం మనకు కల్పించిన ప్రాథమిక హక్కులతో పాటు, ప్రతి పౌరుడు దేశం పట్ల నిర్వర్తించాల్సిన బాధ్యతలు, పౌర కర్తవ్యాల గురించి వివరించారు. రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ, సమాజంలో ఐక్యతను పెంపొందించుకొని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సందేశమిచ్చారు.

విద్యార్థుల్లో దేశభక్తి, ప్రజాస్వామ్య స్పూర్తి, రాజ్యాంగంపై అవగాహన, సామాజిక బాధ్యతలను పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});