manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 10:16 am Editor : user5442714

మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి..

మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల కలెక్టరేట్, నవంబర్ 26, మన భారత్ :
జగిత్యాల జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ బుడుమజ్జి సత్య ప్రసాద్ సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు, విద్యార్థులతో కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీలో చేపట్టిన వివిధ నిర్మాణ పనుల ప్రస్తుత స్థితిగతులు, ఇప్పటివరకు పూర్తయిన పనులు, ఇంకా చేపట్టాల్సిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశించిన గడువులోగా పనులన్నీ నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, విద్యా కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మెడికల్ కాలేజీ నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, మెడికల్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});


(adsbygoogle = window.adsbygoogle || []).push({});