manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 10:13 am Editor : user5442714

నిపాని గ్రామంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

నిపాని గ్రామంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

రాజ్యాంగ హక్కులు, స్వేచ్ఛ, సమానత్వంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి: సర్పంచ్

మన భారత్, భీంపూర్:నవంబర్ 26,

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని నిపాని గ్రామంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పీఠికను సామూహికంగా పఠించి, రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలు, ప్రజాస్వామ్య విలువలను గుర్తుచేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించిందని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలు, సమానత్వం, స్వేచ్ఛ వంటి అంశాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ వాటిని నిత్యజీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి రాజ్యాంగంపై అవగాహన ఎంతో అవసరమని, ముఖ్యంగా యువత రాజ్యాంగ స్ఫూర్తిని తెలుసుకొని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ తనయుడు మల్లెల స్వామి, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు డి. పోచన్న, ఉపాధ్యక్షుడు సూరం రవి, మల్లెల పంజాబ్, సూరం పంజాబ్, గంగారం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});