manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 10:08 am Editor : user5442714

మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నూతన కమిటీల ఎన్నిక

మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నూతన కమిటీల ఎన్నిక
జగిత్యాల, నవంబర్ 26, మన భారత్ :
జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలంలోని పోరండ్ల, జగిత్యాల పట్టణం చింతకుంట వాడ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నూతన కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. ఎమ్మార్పీ జిల్లా నాయకులు బోనగిరి కిషన్ మాదిగ అధ్యక్షతన దుమాల గంగారాం మాదిగ జగిత్యాల ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులు ఆధ్వర్యంలో నూతన కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి విభాగం నూతన నిర్మాణం లక్ష్యంగా మాదిగ విద్యార్థుల భవిష్యత్తు విద్యా ఉద్యోగ రంగాలలో మాదిగ జాతికి ముందు అసలు నిలబెట్టడంలో భాగంగా అదేవిధంగా మాదిగ జాతి భవిష్యత్తు కోసం మహనీయులు కలలుగన్న నూతన సమాజ నిర్మాణం కోసం గ్రామస్థాయి మండల స్థాయి జిల్లాస్థాయి నూతన ఎమ్మార్పీఎస్ కమిటీలు, మండల కమిటీలు జిల్లా కమిటీ, అనుబంధ సంఘాలను ముఖ్యంగా మాదిగ విద్యార్థి విభాగాన్ని స్పెషల్ డ్రైవగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి మండల జిల్లా నూతన మండల అధ్యక్షులు అందరు కలిసి మాదిగ విద్యార్థి విభాగాన్ని నూతన నిర్మాణం చేయడమే లక్ష్యంగా ఆదేశాలను అనుసరిస్తూ గురువారం జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల, జగిత్యాల పట్టణ చింతకుంట వాడ మాదిగ స్టూడెంట్ కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కమిటీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మెడపట్ల హర్షవర్ధన్ మాదిగ, అధికార ప్రతినిధిగా మెడపట్ల సాయి తేజ, ఉపాధ్యక్షులుగా కొలపాక అరుణ్ మాదిగ, మెడ పట్ల అభిషేక్ మాదిగ, ప్రధాన కార్యదర్శి కొలపాక చందు మాదిగ, ప్రధాన కార్యదర్శి తోట నిఖిల్ మాదిగ, సహాయ కార్యదర్శిగా కోలపాక చరణ్ మాదిగ, సంయుక్త కార్యదర్శిగా మెడపట్ల యశ్వంత్ మాదిగ, కార్యదర్శిగా తోట అభినయ్ మాదిగ, కోశాధికారిగా తోట మోహన్ మాదిగ, సంస్కృత కార్యదర్శిగా
మెడ పట్ల మదన్ మాదిగలను ఎన్నుకోవడం జరిగింది. జగిత్యాల పట్టణ చింతకుంట వాడ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కమిటీ అధ్యక్షుడిగా
ఎనుగందుల సుమిత్ మాదిగ, అధికార ప్రతినిధిగా బాలే అరవింద్ మాదిగ, ఉపాధ్యక్షులుగా భలే రిషి మాదిగ, ప్రధాన కార్యదర్శిగా ఎలగందుల సుశాంత్ మాదిగ, చిన్న పాక మజిల్ మాదిగ, కార్యదర్శిగా మెనుగురి తరుణ్ మాదిగ, కోశాధికారిగా బాపురపు మణికంఠ తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});


(adsbygoogle = window.adsbygoogle || []).push({});