manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 10:00 am Editor : user5442714

రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్

రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల/కోరుట్ల, నవంబర్ 26, మన భారత్ :
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మల్లాపూర్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగ సేవలను స్మరించుకున్నారు. భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సోదరభావం అనే విలువలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});


(adsbygoogle = window.adsbygoogle || []).push({});