జగిత్యాల/కొడిమ్యాల, నవంబర్ 25, మన భారత్ :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 10 వ తరగతి వార్షిక పరీక్షల్లో కొడిమ్యాల మండల టాపర్ గా నిలిచిన ఈరు తేజస్విని శ్రీ రాం లైఫ్ ఇన్సూరెన్సు జగిత్యాల జిల్లా శాఖ వారందిస్తున్న 10 వేల రూపాయల నగదు పురస్కారానికి ఎంపికైనది. ఈ మేరకు బుధవారం కొడిమ్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి పాల్గొని తేజస్విని తల్లి రేణుకకు 10 వేల రూపాయల చెక్కును అందజేశారు. శ్రీరాం లైఫ్ ఇన్సూరెన్సు కంపెనీ ఏరియా మేనేజర్ చంద్రశేఖర్ సంస్థ జారీ చేసిన అభినంద పత్రాన్ని రేణుకకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ 10 వ తరగతి పరీక్షల్లో మండల టాపర్ గా నిలిచిన తేజస్వినిని స్ఫూర్తిగా తీసుకుని ఈ సంత్సరము రాష్ట్ర స్థాయిలో టాపర్ గా నిలవాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు ప్రణీత, శ్రీ రామ్ ఇన్సూరెన్సు సంస్థ ప్రతినిధులు మంజుల, అజయ్, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజమల్లయ్య, ఉపాధ్యాయులు మన్మథ రెడ్డి, తిరుపతి రెడ్డి, పద్మ, రాజేంద్ర ప్రసాద్, మోహనమ్మ , అఫ్రోజ్, కళ్యాణ్, సుమన్,సంపత్, దుర్గాప్రసాద్, రాజ్ కుమార్ తదితరులు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
