manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 1:39 am Editor : user5442714

గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి..

గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
– జిల్లా కలెక్టర్ బుడుమజ్జి సత్య ప్రసాద్
– నవంబర్ 30న జిల్లాలో పర్యటించనున్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
– కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం అనంతరం జేఎన్టీయూలో అధికారులతో సమీక్ష
– అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బాధ్యతలను నిర్వహించాలి
– గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష
జగిత్యాల జిల్లా, నవంబర్ 25, మన భారత్ :
ఈ నెల 30న సోమవారం తెలంగాణ రాష్ట్ర గౌరవ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ బుడుమజ్జి సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గౌరవ గవర్నర్ పర్యటన ఏర్పాట్లు, వివిధ ప్రభుత్వ పథకాల అమలు, జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ నవంబర్ 30 సోమవారం రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా జగిత్యాల జిల్లాలో పర్యటించి కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుంటారని, అనంతరం కొండగట్టులోని జేఎన్టీయూలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. నవంబర్ 30న ఉదయం హెలిప్యాడ్‌కు చేరుకోనున్న నేపథ్యంలో అక్కడ అవసరమైన బ్యారికేడింగ్, ఇతర మౌలిక ఏర్పాట్లను ఆర్ అండ్ బీ అధికారులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హెలిప్యాడ్ వద్ద అనుమతి పొందిన వ్యక్తులు మాత్రమే గవర్నర్‌కు స్వాగతం పలికేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జాతీయ గీతం, రాష్ట్ర గేయం ఆడియో ప్రదర్శనలకు సంబంధించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మక పథకాల అమలు తీరు, భౌతిక, ఆర్థిక ప్రగతి, లబ్ధిదారుల వివరాలు, జిల్లాలో సాధించిన విజయాలు, ప్రత్యేక కార్యక్రమాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అన్ని శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా అభివృద్ధి సూచికలు, వినూత్న కార్యక్రమాలు, ఉత్తమ విధానాలు, ప్రధాన విజయాలు, ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను సమగ్రంగా రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్, ఆర్డిఓ మధుసూదన్, డిఎస్పీ పురుషోత్తం రెడ్డి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});


(adsbygoogle = window.adsbygoogle || []).push({});