బొప్పాపూర్ మహిళకు మంత్రి శ్రీధర్ బాబు ఘన సన్మానం
ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల అభివృద్ధిలో ఉద్యోగుల అంకితభావం అభినందనీయం. సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందిన టి. సరోజినీదేవికి శాలువాతో సత్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిని టి. సరోజినీదేవిని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఘనంగా సన్మానించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో తన తండ్రి, దివంగత నాయకుడు దుద్దిళ్ల శ్రీపాదరావు ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల నూతన భవనాన్ని...