మహిళ పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా.. వేధింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఫోన్‌లో మాట్లాడాలని బెదిరింపులు.. సోషల్ మీడియాలో ఫొటోలు అప్‌లోడ్ చేసి వేధింపులు
నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన ఉట్నూర్ ఏఎస్పీ రిత్విక్ సాయి కొట్టే
మన భారత్, ఇచ్చోడ: నవంబర్ 25:
మహిళను ఫోన్‌లో మాట్లాడాలని బెదిరిస్తూ వేధించడంతో పాటు, ఆమె పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించి ఫొటోలను అప్‌లోడ్ చేసిన వ్యక్తిని ఇచ్చోడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఉట్నూర్ ఏఎస్పీ రిత్విక్ సాయి కొట్టే ఐపీఎస్ వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళను నిందితుడు ప్రఫుల్ దత్తాజీ బేజవార్ అలియాస్ బేజ్జరావర్ ప్రఫుల్ అలియాస్ నాని (33) గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఫోన్‌లో తనతో మాట్లాడాలని బెదిరింపులకు పాల్పడటంతో పాటు, బాధితురాలి పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సృష్టించి అందులో ఆమె ఫొటోలను అప్‌లోడ్ చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ చర్యల వల్ల తన వ్యక్తిగత గౌరవానికి, పరువు ప్రతిష్ఠలకు భంగం కలుగుతోందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదును స్వీకరించిన ఇచ్చోడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు ఇతర సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం ఉట్నూర్ ఏఎస్పీ రిత్విక్ సాయి కొట్టే ఐపీఎస్ ఆధ్వర్యంలో నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
మహిళల వేధింపులపై కఠిన చర్యలు
మహిళలను వేధించడం, కులం పేరుతో అవమానించడం, సోషల్ మీడియా వేదికలను ఉపయోగించి వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టించి ఇతరుల ఫొటోలు, వ్యక్తిగత వివరాలను దుర్వినియోగం చేయడం నేరమని పేర్కొన్నారు. బాధితులు ఇటువంటి ఘటనలు ఎదురైనప్పుడు ఆలస్యం చేయకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఆదిలాబాద్
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
