ప్రతి ప్రభుత్వ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించాలి
విద్యార్థులకు రాజ్యాంగ విలువలు, హక్కులు, విధులపై అవగాహన కల్పించాలి – బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రత్నపురం రమేష్
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, ఆదిలాబాద్:
నవంబర్ 26న నిర్వహించే భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక వేడుకలు నిర్వహించాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రత్నపురం రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భారత రాజ్యాంగ ప్రాముఖ్యత, దాని రూపకల్పన వెనుక ఉన్న లక్ష్యాలు, రాజ్యాంగం కల్పించిన హక్కులు, పౌరుల బాధ్యతలపై అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సోదరభావం వంటి గొప్ప విలువలను అందించిందని పేర్కొన్నారు. ఈ విలువలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాల్లో ఆచరణలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న వయస్సు నుంచే రాజ్యాంగ స్ఫూర్తిని విద్యార్థులకు పరిచయం చేయడం ద్వారా సమాజంలో సమానత్వ భావన, ప్రజాస్వామ్య విలువలు పెంపొందుతాయని తెలిపారు.
భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు, ఆయన అందించిన సామాజిక న్యాయం, సమానత్వ సందేశాలను ప్రతి విద్యార్థికి చేరవేయాలని కోరారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులతో పాటు పౌరుల ప్రాథమిక విధుల గురించి కూడా వివరించాలన్నారు.
నవంబర్ 26న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రాజ్యాంగ ప్రవేశిక పఠనం, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, ప్రజాస్వామ్య స్పృహ, సామాజిక బాధ్యత పెంపొందించి భవిష్యత్తులో బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రత్నపురం రమేష్ విజ్ఞప్తి చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
