manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 1:09 am Editor : user5442714

మహిళ పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా.. నిందితుడి అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

మన భారత్ ఇచ్చోడ (ఆదిలాబాద్), నవంబర్ 25:
ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళను వేధిస్తూ, సోషల్ మీడియాలో నకిలీ ఖాతా సృష్టించి ఆమె పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు చెందిన ప్రఫుల్ దత్తాజీ బేజవార్ @ నాని (33) ప్రస్తుతం ఇచ్చోడలోని బర్కత్‌పుర కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతను గత కొంతకాలంగా బాధితురాలిని వేధిస్తూ, ఫోన్‌లో మాట్లాడాలని బెదిరించడమే కాకుండా, ఆమె పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించి ఫోటోలను అప్‌లోడ్ చేశాడు.
నిందితుడికి జ్యుడీషియల్ రిమాండ్:
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇచ్చోడ పోలీసులు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం మరియు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉట్నూర్ ఏఎస్పీ బుధవారం నిందితుడిని అరెస్టు చేసి, న్యాయస్థానంలో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల హెచ్చరిక:
ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలపై వేధింపులు, కులం ఆధారంగా అవమానించడం, సోషల్ మీడియా వేదికగా వేధింపులకు పాల్పడటం వంటి చర్యలను పోలీస్ శాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తుందని ఉట్నూర్ డివిజన్ ఏఎస్పీ స్పష్టం చేశారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});


(adsbygoogle = window.adsbygoogle || []).push({});