దేవపూర్‌లో నాలుగు రోజుల పాటు శిక్షణ విధులు నిర్వహించిన ట్రైనీ కలెక్టర్లకు ఘన సన్మానం
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, తలమడుగు:నవంబర్ 25,
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవపూర్ గ్రామంలో గత నాలుగు రోజులుగా శిక్షణలో భాగంగా విధులు నిర్వహించిన ట్రైనీ కలెక్టర్లకు గ్రామస్థులు, మండల అధికారులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నాలుగు రోజుల పాటు గ్రామంలో బస చేస్తూ వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, గ్రామ పరిపాలన విధానాలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, గ్రామస్థాయిలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వారు పరిశీలించారు.
శిక్షణ కార్యక్రమం చివరి రోజైన బుధవారం గ్రామం తరఫున సర్పంచ్ పోరండ్ల సంతోష్, ఉప సర్పంచ్ మేకల శ్రీరాములు ఆధ్వర్యంలో ట్రైనీ కలెక్టర్లను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో నాలుగు రోజుల పాటు శిక్షణ విధులు నిర్వహించిన అధికారులకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తలమడుగు మండల తహసీల్దార్ రాజమోహన్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శంకర్, పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ హరీష్ కుమార్, మండల విద్యాశాఖ అధికారి జి. వెంకట్రావు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ విజయ, బీసీ వెల్ఫేర్ హెచ్‌డబ్ల్యూఓ నర్సింహులు, పంచాయతీ కార్యదర్శులు రాందాస్, గంగా ప్రసాద్, మండల ఏపీఎం శేఖర్, మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రమోద్ రెడ్డి, ఏఈఓ హర్ష, జూహి తదితరులు పాల్గొన్నారు.
అలాగే హెచ్‌ఎం నరసయ్య, వెటర్నరీ వైద్యురాలు డాక్టర్ సరూప, పీహెచ్‌సీ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, ఐసీడీఎస్ అధికారులు, గ్రామ వీఆర్ఏలు, అటవీ శాఖ, పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులు, పౌరసరఫరాల కేంద్రం ఎండీ మూస, ఇరిగేషన్ అధికారి శ్రీనివాస్‌తో పాటు వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
దేవపూర్ యూత్ అధ్యక్షుడు దాతజీ కిరణ్, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తమ సహకారాన్ని అందించడంతో సన్మాన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. నాలుగు రోజుల శిక్షణలో భాగంగా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడం, గ్రామ పరిపాలనలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బంది పాత్రను ప్రత్యక్షంగా పరిశీలించడం ఈ కార్యక్రమంలో భాగంగా నిలిచింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
