manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 2:02 pm Editor : user5442714

ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

కోసాయి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ప్రభుత్వ అందించిన డ్రాయింగ్ బుక్స్, పెన్సిళ్లు, రబ్బర్లు, షార్పెనర్లు అందజేత

మన భారత్, తలమడుగు:నవంబర్ 25,

విద్యార్థుల్లో చదువుతో పాటు సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు కోసాయి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వివిధ రకాల విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించిన డ్రాయింగ్ బుక్స్, పెన్సిళ్లు, రబ్బర్లు, షార్పెనర్లు తదితర వస్తువులను విద్యార్థులకు అందజేశారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాపురావు ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామగ్రిని అందించారు. డ్రాయింగ్ బుక్స్ ద్వారా విద్యార్థుల్లో చిత్రలేఖనంపై ఆసక్తి పెంపొందించడంతో పాటు, అవసరమైన స్టేషనరీ వస్తువులు అందించడం వల్ల చదువుకు మరింత ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కోసాయి గ్రామ సర్పంచ్ శైలజ రవి, ఉపసర్పంచ్ రామారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాపురావు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});