manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 1:38 pm Editor : user5442714

వ్యాపార ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ జెడ్పీటీసీలు

వివాహ వేడుకలు, నూతన వ్యాపార ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ జెడ్పీటీసీలు, నాయకులు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 25

ఆదిలాబాద్ పట్టణంతో పాటు వివిధ గ్రామాల్లో బుధవారం నిర్వహించిన వివాహ వేడుకలు, నూతన వ్యాపార ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మాజీ జెడ్పీటీసీలు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొని సందడి చేశారు.

ఆదిలాబాద్ పట్టణంలోని రణధీర్ నగర్‌కు చెందిన జక్కుల రమేష్ కుమారుని వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అదేవిధంగా తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన ఎల్చాలా గంగన్న కుమార్తె వివాహ వేడుకకు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం తీర్పెల్లి గ్రామంలో బీబీసీ గోవర్ధన్ రెడ్డికి చెందిన హరి హోమ్ ట్రేడర్స్ నూతన స్టీల్, సిమెంట్ షాపు ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాపార సంస్థ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమాల్లో మాజీ జెడ్పీటీసీలు గోక గణేష్ రెడ్డి, కొండ గంగాధర్, బొల్లారపు బాబన్న, నాయకులు ఏలేటి లక్ష్మారెడ్డి, లోక ప్రవీణ్ రెడ్డి, గాజుల సాంబశివ్ తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});