ఎమ్మెల్సీ రమణకి కన్యకాపరమేశ్వరీ దేవి కుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత
జగిత్యాల, నవంబర్ 24, మన భారత్ :
జగిత్యాల జిల్లా కేంద్రంలో డిసెంబర్ 2 నుండి 6 వరకు వైభవంగా జరగనున్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరీ దేవి పునః ప్రతిష్ఠ, సపరివార దేవత ప్రతిష్ఠ మరియు కుంభాభిషేక మహోత్సవం ఆహ్వాన పత్రికను జగిత్యాల పట్టణ ఆర్య వైశ్య సంఘం సభ్యులు మంగళవారం ఎమ్మెల్సీ ఎల్ రమణకి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మహోత్సవ వివరాలను, ఆలయంలో నిర్వహించనున్న వివిధ పూజా కార్యక్రమాలు మరియు వేడుకల ప్రాధాన్యతను సంఘ సభ్యులు ఆయనకు వివరించారు. ఈ మహోత్సవానికి తప్పక విచ్చేసి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని ఎమ్మెల్సీ ఎల్. రమణ గారిని సాదరంగా ఆహ్వానించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ కోరుకంటి రాము,అల్లాల దామోదర్ రావు, ఏలేటి సురేందర్ రెడ్డి, గంగిపెల్లి శేఖర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వుటూరి నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శి బోడ్ల జగదీష్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మీ మార్గం ఆదిత్య, మన భారత్, జర్నలిస్టు, జగిత్యాల జిల్లా.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
