– ప్రశ్నించే బడుగుల ఓట్లు తొలగించడమే బిజెపి ప్రభుత్వ లక్ష్యం..
– సర్ పై పార్లమెంటులో చర్చ పెడితే పారిపోయిన మోడీ అమిత్ షా..
– ఉమ్మడి కరీంనగర్ కి కేంద్రమంత్రిగా బండి సంజయ్ చేసింది ఏమిటి..?
– దేవుడి పేరుతో ఓట్లు అడగం.. అభివృద్ధి పేరుతో ఎన్నికలకు వెళ్తాం..
– కేంద్ర మంత్రి బండిపై మంత్రి అడ్లూరి ఫైర్..
మన భారత్, ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, నవంబర్ 24, అఖండదీపం :
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు హక్కును కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సర్ ప్రక్రియ పేరుతో కాలరాసే ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రశ్నించే బడుగుల ఓట్లను తొలగించడమే లక్ష్యంగా బిజెపి ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని వారి ఓట్లు తొలగిస్తుందని, కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి నిధులు తీసుకొచ్చారో చెప్పాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రశ్నించే వర్గాల ఓట్లను తొలగిస్తుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పాదయాత్ర పేరుతో యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అన్నారు. బడుగు బలహీన వర్గాల ఓట్లను తొలగిస్తూ బిజెపి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని మంత్రి ఆరోపించారు. ఓట్ల తొలగింపుపై పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చర్చ మొదలు పెడితే చర్చలో జవాబు చెప్పకుండా ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా పారిపోయారని మంత్రి అడ్లూరి అన్నారు. రాహుల్ గాంధీని చూస్తే బిజెపి నాయకులకు భయమేస్తుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం గాంధీల కుటుంబం అని మంత్రి తెలిపారు.
దేవుళ్లను అడ్డం పెట్టుకొని బిజెపి రాజకీయాలు చేస్తుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. యువతను రెచ్చగొడుతు బిజెపి పబ్బం గడుపుతుందని మంత్రి ఆరోపించారు. కేంద్రమంత్రి అమీషా కొడుకు ఎందుకు దేశం కోసం ధర్మం కోసం అంటూ పోరాటం చేయడం లేదంట మంత్రి ప్రశ్నించారు. గత ప్రభుత్వ కాలంలో నిర్మించిన కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చించి సిబిఐ విచారణకు ఆదేశిస్తే కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఎందుకు సిబిఐ ఒత్తిడి తీసుకురావడం లేదని మంత్రి ప్రశ్నించారు. స్విస్ బ్యాంక్ నుండి డబ్బులు తీసుకువచ్చి పేదలకు పెంచుతామని మోడీ చెప్పిన మాటలు ఏమయ్యాయి అని మంత్రి ప్రశ్నించారు.
– బండి సంజయ్ పై మంత్రి అడ్లూరి ఫైర్
కేంద్ర మంత్రి బండి సంజయ్ పై మంత్రి ఆధ్వర్యంలో లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. దేవుడి పేరుతో రాజకీయం చేస్తూ బండి సంజయ్ యువతను రెచ్చగొడుతు తన పబ్బం గడుపుతున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. అందరి గుండెలు లబ్ డబ్ అని కొట్టుకుంటే బండి సంజయ్ మాత్రమే జై శ్రీరామ్ అని కొట్టుకుంటుందా..? అని ప్రశ్నించారు.
అందరి రక్తం ఎర్రగా ఉంటే బండి సంజయ్ రక్తం కాషాయ రంగులో ఉందా..? అని ప్రశ్నించారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని యువతకు బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కేంద్ర మంత్రిగా తీసుకువచ్చిన నిధులు ఏమిటో బండి సంజయ్ చెప్పాలని, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధుల విషయంలో ఏం చొరవ చూపారని మంత్రి బండి సంజయ్ ని ప్రశ్నించారు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతకు కేంద్ర మంత్రిగా కల్పించిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏమిటని ప్రశ్నించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గల్ఫ్ బాధితుల విషయం బండి సంజయ్ ఏనాడు పట్టించుకోలేదని మంత్రి అడ్లూరి అన్నారు. కరీంనగర్ కు తీసుకువచ్చినట్లు నిధులు ఎలా వచ్చాయో వివరాలు వెల్లడించాలని మంత్రి డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా దేవాలయాలకు కేంద్రం నుండి సంజయ్ తీసుకువచ్చిన నిధులు ఏమిటి అని మంత్రి లక్ష్మణ్ ప్రశ్నించారు. నోరు ఉందని బండి సంజయ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్లమీద తిరిగే పరిస్థితి బండి సంజయ్ కి ఉండదని మంత్రి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అర్బన్ డిసిసి అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షులు తాజ్, వైస్ చైర్మన్ ఖలీముద్దీన్, శ్రీనివాస్ రెడ్డి, అహ్మద్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కిమ్ ఫహద్, కాంగ్రెస్ నాయకులు దేవేందర్ పటేల్, ఖదీర్ షా ఖాన్, మహమ్మద్ ఇమ్రాన్, పెంట శేఖర్, మాసూమ్ ఖాన్ తదిరులు పాల్గొన్నారు.
మీ మార్గం ఆదిత్య, మన భారత్, జగిత్యాల జిల్లా 8106910774
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
