manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 3:08 pm Editor : user5442714

హనుమాన్ ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి జోగు రామన్న

హనుమాన్ ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి జోగు రామన్న




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

శాంతినగర్ సర్పవర్ తోటలో ప్రత్యేక పూజలు.. అన్నదాన కార్యక్రమంలో భక్తులతో కలిసి పాల్గొన్న మాజీ మంత్రి

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ సర్పవర్ తోటలో గల హనుమాన్ ఆలయ మొదటి వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సైతం ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాలనీవాసులు మాజీ మంత్రి జోగు రామన్నను శాలువాతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో జోగు రామన్న కాలనీవాసులు, భక్తులతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వ నిధులతో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించినట్లు తెలిపారు. కేసీఆర్ పాలనలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రోత్సాహం అందించడంతో పాటు యాగాలు, యజ్ఞాలు నిర్వహించామని, మరోవైపు ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేశామని పేర్కొన్నారు.

గ్రామాలు, పట్టణాల్లో ప్రజల మధ్య ఐకమత్యం, సోదరభావం, ఆధ్యాత్మిక చింతన పెంపొందించాలనే ఉద్దేశంతో ఆలయాల నిర్మాణంతో పాటు రామమందిరాలు, సవారి బంగ్లాల నిర్మాణాలను కూడా చేపట్టి పూర్తి చేసినట్లు వివరించారు. దేవాలయాలు కేవలం పూజా కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి సామాజిక ఐక్యతను పెంపొందించే కేంద్రాలుగా నిలుస్తాయని అన్నారు.

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనతో ముందుకు సాగుతూ సమాజంలో శాంతి, సోదరభావం, ఐకమత్యం పెంపొందించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు భగవాన్లు, ఎం. రమేష్, భాస్కర్, గోలి గంగారం, శేఖర్, ఎస్. అశోక్, రామన్న, తోట రవీందర్, నారాయణ, లక్ష్మణ్, అశోక్ గౌడ్, సురేందర్ రెడ్డి, స్వామి, బండి ఆశన్న, సాగర్ తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});