పురుగుల మందు తాగిన రైతు దేవన్నకు పరామర్శ.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు జోగు రామన్న సూచన
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, బోరజ్, నవంబర్ 23:
ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలోని హత్తిఘాట్ భూ వివాదాల నేపథ్యంలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఆదిలాబాద్ జిల్లా మాండగడ గ్రామానికి చెందిన రైతు ఎల్మల దేవన్న పురుగుల మందు తాగి అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
రైతు దేవన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు జోగు రామన్న హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవన్నను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
అనంతరం వైద్యులతో మాట్లాడిన జోగు రామన్న రైతు దేవన్నకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. బాధిత రైతు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలోని హత్తిఘాట్ భూ వివాదాల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ పరామర్శ కార్యక్రమంలో ముఖ్యర ప్రభాకర్, బాధ రవి, కనదర్పూర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
