నూతన రిమ్స్ డైరెక్టర్ డా. బలరాం చిక్టేకు ఘన సన్మానం
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
శాలువా, పూలమాలలతో అభినందించిన యువజన సంఘాల నాయకులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ మెంబర్లు
మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 23,
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రి నూతన డైరెక్టర్‌గా నియమితులైన డా. బలరాం చిక్టేను యువజన సంఘాల నాయకులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) లైఫ్ మెంబర్లు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో యువజన సంఘాల జిల్లా అధ్యక్షుడు బాలశంకర్ కృష్ణ పాల్గొని డా. బలరాం చిక్టేకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభినందిస్తూ అందించిన మెమొంటోను నూతన డైరెక్టర్‌కు అందజేశారు.
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్ష
ఈ సందర్భంగా యువజన సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ రిమ్స్ ఆసుపత్రి ఆదిలాబాద్ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉందని పేర్కొన్నారు. నూతన డైరెక్టర్ నాయకత్వంలో ఆసుపత్రి మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వైద్యులు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. రిమ్స్‌లో వైద్య సదుపాయాలు మరింత మెరుగుపడి ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సన్మాన కార్యక్రమంలో యువజన సంఘాల సమితి సభ్యులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ మెంబర్లు ఠాకూర్ రాణా ప్రతాప్ సింగ్, షేక్ మాసూద్, తల్లల అశోక్, గణేష్ వర్మ, సవీన్ రెడ్డి, అజీజ్, పాసపుల రాజు, రాజు పాటుడే, అహ్మద్ తబ్రీజ్, లింగంపల్లి నర్సింహులు, ఉత్తర్వార్ గణేష్, జాదవ్ మిలింద్, రాహుల్ కంబల్ తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
