ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
-ఆకినపల్లి మాజీ ఎంపిటిసి రొంటాల రాజేశ్వరి -సంపత్
మొగుళ్ళపల్లి, నవంబర్ 23,( మన భారత్):
ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు కల్పిస్తున్న ఉపాధి హామీ పనులను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఆకినపల్లి ఎంపిటిసి రొంటాల రాజేశ్వరి సంపత్ అన్నారు. సోమవారం గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో మాజీ ఎంపిటిసి దంపతులు స్వయంగా పాల్గొని ఉపాధి హామీ పనులను పరిశీలించి అక్కడ కల్పిస్తున్న మౌలిక వసతులపై ఆయన ఆరా తీశారు.. ఈ సందర్భంగా రొంటాల రాజేశ్వరి సంపత్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో కీలక మార్పుల్లో భాగంగా ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి ఇచ్చే పనిదినాల హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారని రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కూడా ఉపాధి హామీ కూలీల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తు చేశారు.ప్రతి ఒక్కరూ ఆధార్‌కార్డును బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాలని సూచించారు.పని ప్రదేశాల్లో తాగునీరు తప్పకుండా తీసుకెళ్లాలని తెలిపారు. పని ప్రదేశాల్లో సరైన వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దూడపాక భద్రయ్య పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
