అంబుగాంలో ప్రతి కుటుంబానికి భరోసా.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై అవగాహన కార్యక్రమం
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, తాంసి:నవంబర్ 23,
ఆపద సమయంలో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై తాంసి మండలంలోని అంబుగాం గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు పథకం యొక్క లక్ష్యాలు, ప్రాధాన్యతపై వివరించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ యశ్వంత్ తూర్పబయి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడంలో ఇలాంటి సంక్షేమ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకంపై అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వినియోగించుకోవాలని కోరారు.
కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం లేదా ఇతర విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులకు ఆర్థికంగా అండగా నిలిచే బీమా పథకాల ప్రాధాన్యతను ఈ సందర్భంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యశ్వంత్ తూర్పు బాయి, ఉప సర్పంచ్ ఆత్రం భరత్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
