manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 1:10 am Editor : user5442714

ఐదు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు..

తలమడుగులో ఐదు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు
రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేసిన  సర్పంచ్ రాజన్న, ఎస్ఐ రాధిక




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, తలమడుగు:నవంబర్ 22,

తలమడుగు గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ఐదు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. ఎస్‌ఐ రాధిక సహకారంతో గ్రామ సర్పంచ్ రాజన్న (చంటి) ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేపట్టారు.

గ్రామంలోని ప్రధాన రహదారులపై వాహనాలు అధిక వేగంతో ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటాన్ని దృష్టిలో ఉంచుకొని స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఐదు ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో వాహనదారులు వేగాన్ని తగ్గించి ప్రయాణించే అవకాశం ఉంటుందని, తద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రజలు, ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనాల డ్రైవర్లు రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గ్రామంలో రాకపోకలు సాగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

గ్రామ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని చేపట్టిన ఈ చర్యపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజన్న (చంటి), యువత, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});