వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మాజీ మంత్రి జోగు రామన్నతో కలిసి వివాహ వేడుకలో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే
మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 21, తాంసి మండల మాజీ ఎంపీపీ సురుకుంటి శ్రీధర్ రెడ్డి కుమారుడి వివాహ వేడుక ఆదిలాబాద్ పట్టణంలోని తిరుమల క్లాసిక్ గార్డెన్స్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్నతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నూతన దంపతులను అభినందించి, వారి నూతన జీవితానికి శుభాకాంక్షలు తెలియజేశారు. దంపతులు పరస్పర ప్రేమాభిమానాలు, అవగాహనతో జీవితంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో నిండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
వివాహ వేడుకలో మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు వివిధ మండలాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆహ్వానితుల సందడితో తిరుమల క్లాసిక్ గార్డెన్స్‌లో వివాహ వేడుక ఆనందోత్సాహాల మధ్య కొనసాగింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
