manabharath.com
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 12:12 pm Editor : user5442714

కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల నమోదు ప్రారంభం

బట్టిసావర్గాంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల నమోదు ప్రారంభం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, మావల:నవంబర్ 20,

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదు ప్రక్రియ ఆదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టిసావర్గాం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ప్రత్యేక అధికారి మిల్కా కలిసి ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన కుటుంబాల వివరాలను సేకరించి, దరఖాస్తుల నమోదు ప్రక్రియను సక్రమంగా పూర్తి చేయాలని సూచించారు. పథకానికి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రయోజనం అందేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. దరఖాస్తుల నమోదులో ఎలాంటి తప్పులు జరగకుండా లబ్ధిదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీఓ నందిని, బట్టిసావర్గాం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి అశోక్, వార్డు సభ్యులు ఉషన్న, కృష్ణ, పూజ, రత్నాల లక్ష్మి, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});