manabharath.com
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 6:01 am Editor : user5442714

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదుకు ప్రత్యేక గ్రీవెన్స్ కాల్ సెంటర్

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదుకు ప్రత్యేక గ్రీవెన్స్ కాల్ సెంటర్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందించడమే లక్ష్యం: కలెక్టర్ రాజర్షి షా

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 19, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదును ఎలాంటి తప్పులు, పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న బీమా పథకం నమోదు ప్రక్రియలో అర్హులైన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, నమోదు ప్రక్రియను నిర్ణీత మార్గదర్శకాల ప్రకారం పూర్తి చేయాలని తెలిపారు. లబ్ధిదారుల వివరాల నమోదు సమయంలో వ్యక్తిగత సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని, అర్హులైన వారు ఎవరూ పథకానికి దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కాల్ సెంటర్

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించి ప్రజలకు ఎదురయ్యే సందేహాలు, నమోదు ప్రక్రియలో తలెత్తే సమస్యలు, ఇతర ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక గ్రీవెన్స్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

పథకానికి సంబంధించి ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే లబ్ధిదారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కింది ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ప్రత్యేక గ్రీవెన్స్ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు

http://99519 35312 82470 13660 94414 85893

 

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బీమా పథకం అమలు చేయడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోందని కలెక్టర్ తెలిపారు. అర్హులైన కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైన సమాచారం కోసం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కాల్ సెంటర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});