manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 2:21 pm Editor : user5442714

ప్రధాన రహదారి పనులు వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్

ఇచ్చోడా ప్రధాన రహదారి పనులు వేగవంతం చేయాలి..




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, లింక్ రోడ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్

మన భారత్, ఇచ్చోడా:

ఇచ్చోడా మండల కేంద్రంలోని ప్రధాన రహదారి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రోడ్లు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారిపై మిగిలిపోయిన పనులతో పాటు డ్రైనేజీ నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, లింక్ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఇచ్చోడా మండల కేంద్రంలోని ప్రధాన రహదారిని స్వయంగా పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన పనులు, ఇంకా పెండింగ్‌లో ఉన్న పనుల పురోగతిని ఆర్‌అండ్‌బీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా నిర్ణీత సమయంలో నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న సమయంలో, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వ హయాంలో ఇచ్చోడా ప్రధాన రహదారి అభివృద్ధి కోసం రూ.13 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం తన హయాంలో చేపట్టిన తొలి రహదారి అభివృద్ధి పనుల్లో భాగంగా ఇచ్చోడా ప్రధాన రహదారి పనులను ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 50 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు.

మిగిలిన రహదారి నిర్మాణ పనులతో పాటు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, లింక్ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణాన్ని కూడా త్వరలో పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు ఇచ్చోడా మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

పనుల విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ, ఇచ్చోడా మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});