manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 2:18 pm Editor : user5442714

కరవు మండలంగా ప్రకటించాలని డిమాండ్..

తలమడుగు కరవు మండలంగా ప్రకటించాలి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ నెల 23న సుంకిడిలో రైతు జేఏసీ ఆధ్వర్యంలో ‘ఛలో సుంకిడి’ నిరసన

మన భారత్, తలమడుగు: నవంబర్ 19, తలమడుగు మండలాన్ని కరవు మండలంగా ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 23న రైతు జేఏసీ ఆధ్వర్యంలో సుంకిడి గ్రామంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు. మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న కరవు పరిస్థితులను ప్రభుత్వం గుర్తించి, తక్షణమే తలమడుగును కరవు మండలంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తలమడుగు మండలంలో రైతులు తీవ్ర వర్షాభావ పరిస్థితులు, పంటల నష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కరవు మండలాల జాబితాలో తలమడుగుకు చోటు కల్పించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, కరవు మండలంగా ప్రకటించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నవంబర్ 23న సుంకిడిలో నిర్వహించనున్న ‘ఛలో సుంకిడి’ నిరసన కార్యక్రమానికి మండలంలోని ప్రతి గ్రామం నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఐక్యంగా తమ నిరసన గళాన్ని వినిపించాలని పిలుపునిచ్చారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రైతు జేఏసీ అధ్యక్షుడు నల్ల పద్మాకర్ రెడ్డి, బీఆర్ఎస్ యువ నాయకుడు అభిరామ్ రెడ్డి, తలమడుగు సర్పంచ్ ఎలుగు రాజన్న, ఖోదాద్ సర్పంచ్ ఎముల ప్రియాంక లక్ష్మారెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, రైతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});