manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 3:23 am Editor : user5442714

కళ్లముందే బూడిదైన మొక్కజొన్న పంట.. కౌలు రైతుకు తీరని నష్టం!

కళ్లముందే బూడిదైన మొక్కజొన్న పంట.. కౌలు రైతుకు తీరని నష్టం!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

10 ఎకరాల్లో సాగు.. మరికొద్ది రోజుల్లో చేతికందాల్సిన పంట అగ్నికి ఆహుతి

మన భారత్, భీంపూర్:నవంబర్ 18,

ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే మంటల్లో కాలిపోవడంతో ఓ కౌలు రైతు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్ కోటి గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది.

గ్రామానికి చెందిన రైతు షేక్ జావిద్ 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంట సాగు చేశారు. పంట కోసం పెట్టుబడులు పెట్టి, నెలల తరబడి శ్రమించి పండించిన మొక్కజొన్న మరికొద్ది రోజుల్లో చేతికందే పరిస్థితి ఉండగా అనూహ్యంగా అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో పంట మొత్తం మంటలకు ఆహుతైంది.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సమాచారం అందించినప్పటికీ, రాత్రి సమయం కావడంతో పాటు చీకటి కారణంగా మంటలను అదుపు చేయడం సాధ్యం కాలేదు. చూస్తుండగానే మంటలు పంట పొలమంతా వ్యాపించడంతో రైతు తీవ్రంగా నష్టపోయారు. అప్పులు చేసి, కౌలుకు భూమి తీసుకుని సాగు చేసిన పంట కళ్లముందే కాలిపోవడంతో షేక్ జావిద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

పంట చేతికొచ్చే సమయంలో జరిగిన ఈ అగ్నిప్రమాదం రైతు కుటుంబానికి తీరని ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది. సంబంధిత వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పంట నష్టాన్ని పరిశీలించి, బాధిత కౌలు రైతుకు ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});