రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ పోటీలకు బజార్‌హత్నూర్ జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థుల ఎంపిక
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఉమ్మడి జిల్లా పోటీల్లో ఆదిలాబాద్ జట్టుకు ద్వితీయ స్థానం.. నలుగురు విద్యార్థులకు రాష్ట్ర స్థాయి అవకాశం
మన భారత్, బజార్‌హత్నూర్, నవంబర్ 18: మంచిర్యాల జిల్లా మందమర్రిలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ (SGF) అండర్-17 నెట్‌బాల్ క్రీడా పోటీల్లో ఆదిలాబాద్ జట్టు ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానం సాధించింది. ఈ పోటీల్లో బజార్‌హత్నూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు అత్యుత్తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి తెలంగాణ రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు.
జిల్లా స్థాయి పోటీల్లో ఆటతీరు, సమన్వయం, పట్టుదలతో ఆకట్టుకున్న విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థుల్లో పదో తరగతికి చెందిన పి. ప్రీతి, యం. ఉజ్వల, యం. పవన్‌తో పాటు తొమ్మిదో తరగతికి చెందిన సీహెచ్. రవి ఉన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జే. భూమన్న, ఉపాధ్యాయ బృందం విద్యార్థుల విజయంపై హర్షం వ్యక్తం చేశారు. క్రీడల్లో విద్యార్థులు చూపిన ప్రతిభ అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ఇదే ఉత్సాహంతో ఆడి మరింత మెరుగైన ప్రతిభ కనబరచాలని, పాఠశాలతో పాటు బజార్‌హత్నూర్ మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన నలుగురు క్రీడాకారులను గ్రామస్థులు, విద్యాభిమానులు ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
