బంధం రేగడ్లో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం
బంధం రేగడ్లో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం గ్రామీణ అభివృద్ధికి కేసీఆర్ పాలనలో పెద్దపీట వేశాం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మన భారత్, నేరడిగొండ: నవంబర్ 18, గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండలంలోని బంధం రేగడ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు...