manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 3:10 pm Editor : user5442714

వివాహాది శుభకార్యాలకు హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

పలు వివాహాది శుభకార్యాలకు హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 18, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి నేడు నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను, కుటుంబ సభ్యులను అభినందించారు. వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా వివాహ వేడుకలకు హాజరైన ఆయన ఆయా కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. శుభకార్యాల్లో పాల్గొనడం ద్వారా స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలతో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమాల్లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, ఆత్మ చైర్మన్ కౌడల నారాయణ, కప్పర్ల సర్పంచ్ అరుణ్, తాంసి మండల అధ్యక్షుడు కౌడాల సంతోష్ తదితరులు బోరంచు శ్రీకాంత్ రెడ్డి వెంట పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});